language
english

అరగంటకింద “అర్హ” ఫొటో పోస్ట్ చేసిన బన్నీ, లక్ష దాటిన ఫాలోవర్ల సంఖ్య

అల్లు అర్జున్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ .. బన్నీ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తెలుస్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ? ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తన ఫాన్స్ కు దగ్గరగా ఉన్న బన్నీ .. ఇప్పుడు వారికీ మరింత దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు.

1.26 కోట్ల మంది ఫాలోవర్లు

అల్లు అర్జున్ ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్‌లో బోలెడు క్రేజ్ వుంది. లక్షల్లో అభిమానులు వున్నారు. ఇప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు. ఫేస్ బుక్‌లో అతడి పేరిట ఉన్న పేజీకి ఏకంగా 1.26 కోట్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

17 లక్షల మంది ఫాలోవర్లు

ట్విట్టర్లోకి కొంచెం లేటుగా వచ్చిన అతను అక్కడా 17 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇప్పడు బన్నీ మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ ఇన్‌స్ట‌ాగ్రామ్‌లోకి కూడా వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ అతడి అకౌంట్ మొదలైపోయింది.

ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదు విశేషం ఏంటంటే..

బన్నీ ఇంకా అక్కడ ఒక్క అప్ డేట్ కూడా పెట్టలేదు. ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదు. అంతలోనే అతడి ఫాలోవర్ల సంఖ్య లక్షకు దాటిపోయింది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఫొటో పెట్టడానికి బన్నీ ఒక ముహూర్తం కూడా చూసుకున్నాడు. ఈ రోజే అతను అక్కడ తొలి ఫొటో షేర్ చేస్తాడట. దీని గురించి ముందే ప్రకటన కూడా చేశాడు బన్నీ.

మెమొరబుల్ ఫొటో

ఒక ఙ్ఞాపకంగా మారే ఫొటోల్ని క్యాప్చర్ చేయడమంటే తనకెంతో ఇష్టమని.. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఫొటోలతో తన జర్నీ 21వ తారీఖు మొదలు కానుందని.. ఒక మెమొరబుల్ ఫొటో ఒకటి ఆ రోజు షేర్ చేస్తానని బన్నీ తెలిపాడు. మరి బన్నీ షేర్ చేయబోయే స్పెషల్ ఫొటో ఏదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే తన కూతురు అర్హా ఫొటోతో అందరినీ సర్ప్రైజ్ చేసాడు బన్నీ. అరగంటలోనే వేలాది లకులు వచ్చేసాయ్ ముద్దుల అర్హ ఫొటోకి.

Comments

comments

Movie News
Telugu News