language
english

పవన్ కళ్యాణ్, సన్నీలియోన్ ఒక వర్మ: వర్మ మరీ ఇంత ధారుణంగా పోల్చాడు

వివాదాల రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ పై ఆయన ఫ్యాన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులకు, సన్నీలియోన్ ను చూడటానికి వచ్చిన వారికి పోలిక పెడుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మొన్న నందిపై గళమెత్తితే, నిన్న ఏకంగా ట్రంప్ కూతురిపైనే కన్నేశాడు. ఇవాంకాని తనివితీరా చూడాలి అంటూ పోస్ట్ చేశాడు. ఆమెను సన్నీలియోన్ తో పోల్చాడు. అయితే వర్మకి సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయడానికి కూడా ఆమెనే వాడాడు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సన్నీలియోన్ ని అడ్డంపెట్టుకొని ఒక పోస్ట్ చేశాడు వర్మ. జనసేన పార్టీతో సన్నీలియోన్ కలిస్తే వీరి కలయిక సూపర్ హిట్ అవుతుందంటూ పేర్కొన్నారు. వరుసగా 4 ట్వీట్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి పవన్, సన్నీ, వర్మ ముగ్గురూ ఒకే ఫోజులో ఉన్న పిక్ ని జత చేశారు. వర్మ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే… సన్నీలియోన్ కి పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ జనం వస్తున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం. వచ్చే ఎన్నికల్లో సన్నీలియోన్ పవన్ కల్యాణ్ కలయిక తిరుగులేని రాజకీయ ఎత్తుగడ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం.. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకు వేరు వేరు ఎంటర్ టైనింగ్ సుఖాలు ఇచ్చారు. పవన్ కల్యాణ్ కి ఉన్న లక్షల ఫ్యాన్స్ కి.. సన్నీలియోన్ కి.. పవన్ కల్యాణ్ కి మధ్య ఒకరికే హగ్ ఇచ్చే అవకాశం వస్తే ఎవరిని హగ్ చేసుకుంటారా అన్నది పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా నా ప్రశ్న. జనసేన/జనసేవ పార్టీతో పవన్ కల్యాణ్/సన్నీలియోన్ కలయిక సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే వారిద్దరు జనాన్ని ఆకట్టుకుంటారు.

Comments

comments

Movie News
Telugu News