language
english

ఇవాంకా టూర్: రంగంలోకి ‘జేమ్స్‌బాండ్‌‌లు’, మహిళా ఐపిఎస్ అధికారి రక్షణ

హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన కోసం ఆమెరికా అనేక రకాల ముందు జాగ్రత్తలను తీసుకొంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలను తలపించే రీతిలో రహస్యంగా ఇవాంకా ట్రంప్ రక్షణ బాధ్యతలను అమెరికా తీసుకొంటుంది.ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని ఆమె పర్యటించే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.ఇవాంకా ట్రంప్ టూర్: సివిల్ దుస్తుల్లోనే పోలీసులు, తలనొప్పిగా భద్రతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఈ నెల 28న, జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రైన్యూస్ సమ్మిట్ లో పాల్గొనేందుకు రానున్నారు. అయితే ఆమె పర్యటనకు సంబంధించి రక్షణ చర్యలను అమెరికా అధికారులే స్వయంగా చూసుకొంటున్నారు.ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని ఇప్పటికే తెలంగాణ పోలీసులకు అమెరికా పోలీసులు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఈ సూచనల ఆధారంగా తెలంగాణ పోలీసులు వ్యవహరించనున్నారు. ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం అమెరికాకు చెందిన జేమ్స్ బాండ్ లు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లో సంచరిస్తున్నారు. ఇవాంకా ట్రంప్ పర్యటించే ప్రాంతంలో వారు పర్యటనలు చేస్తూ జాగ్రత్తలు రక్షణ వ్యవహరాలు చూస్తున్నారు. ముందస్తుగా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇవాంకా పర్యటనలో ఎక్కడెక్కడకు వెళతారు? ఎవరెవరు ఆమెను కలుస్తారు? వారి నేపథ్యం ఏంటి? వారికున్న భద్రత, సామాజిక స్థాయి ఏమిటి? వంటి వివరాలన్నింటినీ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రహస్యంగా సేకరిస్తున్నారు.15 మంది అమెరికన్ జేమ్స్ బాండ్ లు నెల రోజుల కిందే హైదరాబాద్ కు వచ్చారని సమాచారం. ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటనను పురస్కరించుకొని అమెరికా అధికారులు మామూలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సాధారణ విదేశీ పర్యటకులుగా వచ్చిన ఆ ఏజెంట్లు.. ఇవాంకా పర్యటించే ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, రోడ్ మ్యాప్, ఇక్కడి పోలీసులు చేపడుతున్న భద్రతా వ్యవహారాలు.. తదితర అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించి అమెరికా భద్రతా విభాగాలకు పంపుతున్నారని సమాచారం. ఇవాంకా పాల్గొనే సదస్సులో వేదిక మీద ఉండే వాళ్లు ఎవరు, వారి పూర్తి వివరాలేమిటి అనే అంశాలతోపాటు చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్ ప్రాంతాలు, అక్కడి నిర్వాహకులెవరనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారం ఆధారంగానే ఇవాంకా ట్రంప్ పర్యటనను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇవాంకా భద్రతా, లైజన్ ఆఫీసర్ గా మహిళా అధికారిని నియమించేందుకు పోలీస్ శాఖ సన్నాహలు చేస్తోంది.ఎఫ్ బీఐ వర్గాలు ఇచ్చే సూచనల మేరకు ఎస్పీజీ నుంచి మహిళా అధికారిని కేటాయించే అవకాశముందని పోలీస్ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణలో పర్యటన కాబట్టి ఇక్కడి ఎస్పీ ఆపై స్థాయి ఉన్న మహిళా అధికారిని నియమించుకునేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

Comments

comments

Movie News
Telugu News