language
english

ఇవాంకా రాక: సర్వాంగ సుందరంగా హైటెక్ సిటీ, రోడ్డు పక్కన అవి బంద్.. ’30రోజుల ఫుటేజీ’

హైదరాబాద్: ఇవాంకా రాకవేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారంటే చాలు.. నానా హైరాన పడిపోయి సిటీని అందంగా ముస్తాబు చేయడం, బిచ్చగాళ్లను తరలించడం గతంలోనూ జరిగాయి.ప్రభుత్వం ఎంత చేస్తే మాత్రం అమెరికా సీఐఏకి హైదరాబాద్ పరిస్థితేంటో తెలియదా?.. అనేవారు లేకపోలేదు. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ అతిథులకు భాగ్య నగరాన్ని విశ్వ నగరంగా చూపించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే భద్రతా రీత్యా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్ ) సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు హైదరాబాద్ ఐటీ కారిడార్ ను సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్ భద్రతా ఏర్పాట్లపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు తెలంగాణ సేఫ్టీ(మెజర్స్ ) ఎన్ ఫోర్స్ మెంట్ యాక్ట్ 2013 ప్రకారం ఆయా సంస్థల యజమానులు, నిర్వాహకులు, వ్యక్తులు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని మాదాపూర్ జోన్ పోలీసులు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో సమ్మిట్ లో పాల్గొనే ప్రతినిధులు ఎవరైనా ఐటీ కారిడార్ లోని షాపింగ్ మాల్స్, లేదా ఇతరత్రా సంస్థలను సందర్శిస్తే.. భద్రతా ఏర్పాట్లను ఆయా సంస్థలే పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సందర్శకుల రాకపోకలపై గట్టి నిఘా పెట్టాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చిపోయే సందర్శకులు, ఎంట్రీ-ఎగ్జిట్ పై నిరంతర నిఘా, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీటివి కెమెరాలు.. ఇలా 30రోజుల భద్రతకు సంబంధించిన వీడియో ఫుటేజీని భద్రపరచాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమానాకు తోడు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు.. ఇవాంకా బస చేయనున్న వెస్టిన్ హోటల్ నుంచి సదస్సు జరిగే హెచ్ఐసీసీ మార్గం మొత్తం నిఘా నీడలోనే ఉండనుంది. ఇదే క్రమంలో ఫుట్ పాత్ వ్యాపారాలను కూడా మూసివేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సదస్సుకు ఒక రోజు ముందు నుంచి సదస్సు ముగిసేవరకు చిల్లర వ్యాపారాలు ఉండరాదని చెబుతున్నారు. మసీదు చౌరస్తా నుంచి హెచ్ ఐసీసీకి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న గడ్డి బొమ్మల తయారీదారులను ఖాళీ చేయమని ఆదేశించారు. రెండు నెలల క్రితం స్థానిక నాయకుడికి వేలాడి డబ్బులిచ్చి మరీ ఇక్కడ గుడిసెలు వేసుకుంటే.. ఉన్నపలంగా తమను ఖాళీ చేయిస్తున్నారని, ఇప్పుడు తామెక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు నెలల్లో తామేమి సంపాదించలేదని, ఇంతలోనే వెళ్లమంటే ఎలా అని వాపోతున్నారు. ఇవాంకా పర్యటన నేపథ్యంలో అధికారులు నగరాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో సుందరీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు రోడ్లు, ఫుట్ పాత్ లను మెరుగుపరుస్తున్నారు. అలాగే గ్రీనరీ కోసం రోడ్ల పక్కన, పలు సందర్శనీయ ప్రాంతాల్లో ఆకర్షనీయ మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల బొమ్మల కొలువులు, చెట్లపై చిత్రాలు, బెంచీలపై రంగుల పనులు కొనసాగుతున్నాయి. ఫ్లై ఓవర్లను సైతం ముస్తాబు చేస్తున్నారు. పలు చోట్ల తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే చిత్రాలను వేయిస్తున్నారు.

Comments

comments

Movie News
Telugu News