language
english

గుజరాత్ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల, మొదటి జాబితాలో నలుగురికి షాక్!

అమ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 13 మంది పేర్లు ఉన్నాయి. సీనియర్లను పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ 9 మంది కొత్త వారికి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించింది.ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు 77 మందితో మొదటి జాబితాను విడుదల చేశారు. నిరసనలు, పటీదార్ వర్గం నాయకుల ఒత్తిడితో 77 మంది జాబితాలో నలుగురు అభ్యర్థులను పక్కన పెట్టి వేరే నాయకులకు అవకాశం కల్పించాలని భావించారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 86 మంది అభ్యర్థులను ప్రకటించింది.గుజరాత్ లోని 89 శాసన సభ నియోజక వర్గాల్లో మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 9వ తేదీన జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి నవంబర్ 21వ తేదీ మంగళవారం చివరి రోజు కావడంతో మిగిలిన ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు.

Comments

comments

Movie News
Telugu News