language
english

చైనా కొత్తతరం క్షిపణి! ధ్వనికన్నా 10 రెట్ల వేగంతో.. ప్రపంచంలో ఎక్కడికైనా..

బీజింగ్ : బహుళ అణు వార్ హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.డాంగ్ ఫెంగ్ -41 అనే ఈ క్షిపణి.. ధ్వని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. శత్రుదేశపు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలను ఏమార్చి దాడులు చేయగలదు. వచ్చే ఏడాది చైనా సైన్యం అమ్ములపొదిలో ఈ క్షిపణి చేరనుంది.ఈ అధునాతన ఖండాంతర క్షిపణిలో మూడు అంచెలు ఉన్నాయి. అవన్నీ ఘన ఇంధనంతో పని చేస్తాయి. ఈ క్షిపణి కనీసం 12 వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. అంటే.. ప్రపంచంలో ఏ ప్రాంతంమీదైనా ఇది విరుచుకుపడగలదు.డాంగ్ ఫెంగ్ -41 క్షిపణి తనతోపాటు 10 అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రయోగానంతరం.. అవన్నీ క్షిపణి నుంచి విడిపోయి.. నిర్దేశించిన రీతిలో వేరు వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. అమెరికాను దృష్టిలో పెట్టుకొనే చైనా దీన్ని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

comments

Movie News
Telugu News