language
english

సంపదలో సగభాగం దాతృత్వానికే: ‘ఇన్ఫోసిస్’ నీలేకని సంచలనం, భగవద్గీతే ప్రేరణ

బెంగళూరు: ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకులు, ప్రస్తుత ఛైర్మన్ నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సంపదలో సగభాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. తమ సంపదలో అర్ధభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రపంచ సంపన్నులు నెలకొల్పిన ది గివింగ్ ప్లెడ్జ్ లో నీలేకని దంపతులు కూడా చేరారు. నీలేకని అంగీకారంతో రాసిన లేఖను ది గివింగ్ ప్లెడ్జ్ వెబ్ సైట్ అప్ లోడ్ చేసింది. భగవద్గీత నుంచి పొందిన ప్రేరణతో.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. దాన్నుంచి ప్రతిఫలాన్ని ఆశించవద్దు. ప్రత్యక్ష ప్రతిస్పందన లభించదనే భావనతో, చేయకుండా ఆగిపోకూడదు అని వివరించారు. నీలేకని దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. ఇప్పటికే భారత్ కు చెందిన విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా, శోభా డెవలపర్స్ గౌరవ ఛైర్మన్ పీఎన్ సీ మేనన్ ఈ పథకంలో భాగస్వాములయ్యారు. కాగా, ఈ సందర్భగా నీలేకని మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయి. యువత, శ్రమ జీవులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ధనం ఎక్కువగా ఉన్నవారు పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయాలి అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా నీలేకని ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో తనవంతు బాధ్యతగా సాయమందించారు.

Comments

comments

Movie News
Telugu News